యువ హీరో శర్వానంద్ వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ అందుకు తగిన ఫలితాన్ని మాత్రం అందుకోవట్లేదు.సెప్టెంబర్ 9న ఒకే ఒక జీవితం సినిమాతో రాబోతున్నాడు శర్వానంద్.
శ్రీ కార్తీక్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తుంది.సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమా మీద అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమా తర్వాత రైటర్ కృష్ణ చైతన్య డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు శర్వానంద్.
అయితే ఈ సినిమాకి బదులుగా కొరియోగ్రాఫర్ రాజు సుందరంతో శర్వానంద్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం డైరక్షన్ లో శర్వానంద్ హీరోగా ఒక సినిమా వస్తుందని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి.రాజు సుందరం చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ కూడా ఓకే చేశాడట.
అయితే వరుస ఫ్లాపులు శర్వానంద్ ఆలోచనని మార్చుకునేలా చేసినట్టు తెలుస్తుంది.ఇప్పుడు శర్వానంద్ సినిమా క్యాన్సిల్ చేసుకుని కృష్ణ చైతన్య సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది.
రీసెంట్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న శర్వానంద్ ఈ సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నట్టు తెలుస్తుంది.







