బిగ్ బాస్ సీజన్ 6 హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడే కంటెస్టంట్స్ అంతా ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటున్నారు.ఆల్రెడీ గలాటా గీతు బాత్ రూం లో హెయిర్ గురించి ఇయానా తో గొడవ పడ్డది.
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా క్లాస్, ట్రాష్, మాస్ అనే మూడు తరగులుగా కంటెస్టంట్స్ ని డివైడ్ చేసి వారిలోంచి నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు.
అయితే బిగ్ బాస్ సీజన్ 5 వరకు ఓటీటీలో 24 గంటలు షో ఇవ్వలేదు.
సీజన్ 4, 5 లు ఇచ్చినా ఓటీటీ మీద అంత ఆసక్తి చూపించలేదు.అయితే బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ రావడంతో బిగ్ బాస్ ఆడియెన్స్ ఓటీటీలో కూడా చూడటం మొదలు పెట్టారు.
అక్కడ చూసిన దానిలో టీవీలో చూపించేది చాలా తక్కువ అన్న ఫీలింగ్ ఆడియ్నన్స్ కి వచ్చేసింది.బిగ్ బాస్ సీజన్ 6 కి ఓటీటీ 24 గంటల లైవ్ దెబ్బ వేసేలా ఉందని చెప్పొచ్చు.
మరి దీన్ని బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా హ్యాండిల్ చేస్తారన్నది చూడాలి. బిగ్ బాస్ స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్ మాత్రం సీజన్ 6 ని ఫుల్ గా ఎంజాయ్ చేసేలా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది.







