మంచు మనోజ్ రెండో పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదా.. అసలేమైందంటే?

మంచు మనోజ్ భూమా మౌనిక కలిసి కనిపించడంతో వీళ్లిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.మనోజ్ రెండో పెళ్లి వార్తను పూర్తిస్థాయిలో ఖండించకపోవడంతో వైరల్ అవుతున్న వార్త నిజమేనని అందరూ నమ్ముతున్నారు.

 Rumours Goes Viral About Manchu Manoj Second Marriage Details Here , Manchu Ma-TeluguStop.com

అయితే భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబుకు ఇష్టం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

మోహన్ బాబు సూచించిన అమ్మాయి కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మనోజ్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని బోగట్టా.

ప్రస్తుతం మోహన్ బాబు వైసీపీలో ఉండటం భూమా మౌనిక కుటుంబ సభ్యులు టీడీపీలో ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి పంపకాలు కూడా జరగనున్నాయని ప్రచారం జరుగుతోంది.

అయితే మోహన్ బాబు లేదా మనోజ్ స్పందించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే మాత్రమే ఈ విషయాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉంటాయి.మరోవైపు మంచు మనోజ్ హీరోగా అహం బ్రహ్మాస్మి అనే సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు.

Telugu Aham Brahmasmi, Bhuma Mounika, Manchu Manoj, Manojs, Mohan Babu-Movie

పండుగల సమయంలో, సెలబ్రిటీల పుట్టినరోజు సమయంలో మాత్రమే మంచు మనోజ్ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.మంచు మనోజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మనోజ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

మనోజ్ చాలామంది మిడిల్ రేంజ్ హీరోలతో పోల్చి చూస్తే తక్కువగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube