బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో కాఫీ విత్ కరణ్.ఈ షో బాలీవుడ్ లో ఎంత పాపులర్ అయ్యిందో మనందరికి తెలిసిందే.
ఈ షోలో పాల్గొన్న సెలబ్రిటీలను కరణ్ జోహార్ వారి వ్యక్తిగత విషయాలతో పాటుగా వారి శృంగారం కీ సంబందించిన ప్రశ్నలను కూడా అడిగి సమాధానాలు రాపడుతూ ఉంటాడు.సెక్స్ లైఫ్ గురించి ఎంతో ఓపెన్ గా ప్రశ్నించి వాళ్ల జీవితాల్లోకి తొంగి చూస్తున్నాడు.
కేవలం వీరు మాత్రమే కాకుండా ఇప్పటివరకు హాజరైన ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఈ సెక్స్ విషయం గురించి ప్రశ్నలు వేసి తన స్టైల్ లో ఆన్సర్లు రాబట్టాడు.
అయితే మొదట్లో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలు కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తూనే ఇక చివరికి వచ్చేసరికి షో కి కావాల్సినంత పాపులరిటిని తెచ్చి పెడుతున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కరణ్ హోస్ట్ వ్యవహరిస్తున్న ఈ షోలో కత్రినా కైఫ్ పాల్గొంది.ఎప్పటి లాగానే ఇంకా కరణ్ జోహార్ ఆమెను మీ ఫస్ట్ నైట్ అనుభూతులు ఏంటో చెప్పొచ్చుగా అని అడిగేసాడు.
దానికి క్యాట్ సైతం అంతే ఓపెన్ గా సమాధానం ఇచ్చింది.మాది సుహాగ్ రాత్రి కాదని సుహాగ్ డే అని సమాధానం ఇచ్చింది.
అంటే వారి శోభనం రాత్రి కాదు.పగటి పూట జరిగిందని చెప్పుకొచ్చింది.ఈ ప్రశ్నతో కరణ్ జోహార్ మరొకసారి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచాడు.కాగా ఈ షో ని చూస్తున్న నెటిజన్స్ కరణ్ జోహార్ ని భారీగా ట్రోలింగ్ చేయడంతో పాటుగా బూతులు తిడుతున్నారు.
కరణ్ కీ ఈ ఫస్ట్ నైట్ పిచ్చేంటో అర్థం కావడం లేదు అంటూ కరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.