ఎన్టీఆర్‌, బుచ్చిబాబుల 'కబడ్డీ' కి ముందు మరో ఉప్పెన ఉంటుందా?

మొదటి సినిమా ఉప్పెన తో భారీ బ్లాక్ బస్టర్ ని దక్కించుకున్న దర్శకుడు బుచ్చిబాబు.ఈయన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కి శిష్యుడు అనే విషయం తెలిసిందే.

 Before Ntr Movie Buchibabu Going To Do A Film With Viashnav Tej , Buchibabu, Fli-TeluguStop.com

దర్శకుడు సుకుమార్‌ ఎలా అయితే తన సినిమాకి సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడో అలాగే ఆయన శిష్యుడు గా బుచ్చి బాబు కూడా సాధ్యమైనంత ఎక్కువగా గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారేమో కానీ ఉప్పెన సినిమా విడుదల ఈ రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు తదుపరి సినిమాకు సంబంధించిన క్లాప్‌ కొట్టింది లేదు.ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో కబడ్డీ అనే సినిమా ను ఈయన చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

కానీ ఎన్టీఆర్ వరుసగా సినిమాలు కమిట్‌ అయ్యి ఉన్నాడు.ఆ సినిమా లు కంప్లీట్‌ చేసేందుకు కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.

అప్పటి వరకు దర్శకుడు బుచ్చి బాబు వెయిట్ చేస్తాడా లేదంటే మరో సినిమా ను చేస్తాడా అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

కానీ తాజా సమాచారం ప్రకారం తన మొదటి సినిమా యొక్క హీరో వైష్ణవ తేజ్ తో ఒక చిన్న సినిమా ను చేసేందుకు ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సిద్ధం అయ్యాడు అంటున్నారు.

బుచ్చి బాబు కనుక ఎన్టీఆర్ సినిమా కాదని వైష్ణవి తేజ్ తో సినిమా చేస్తే… ఒక వేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే కచ్చితంగా ఎన్టీఆర్ సినిమా వదులుకోవాల్సి వస్తుంది అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.కానీ ఎన్టీఆర్ నుండి స్పష్టమైన హామీ తీసుకున్న బుచ్చి బాబు తన ఈ గ్యాప్ ని వైష్ణవ తేజ్ తో ఫుల్ ఫీల్ చేసేందుకు సిద్ధం అయ్యాడు అంటూ సమాచారం అందుతుంది.

సినిమా ఫలితం తో సంబంధం లేకుండా కచ్చితం గా ఎన్టీఆర్ మరియు బుచ్చి బాబు సినిమా ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.ఎన్టీఆర్ నుండి పూర్తి హామీ తీసుకున్న తర్వాత నే వైష్ణవ తేజ్ తో సినిమా ను మొదలు పెట్టేందుకు బుచ్చి బాబు రెడీ అయ్యాడని సమాచారం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube