సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే కొన్ని వీడియోలు చాలా అద్భుతంగా ఉంటాయి.ఒక్కోసారి అందులో ఉన్నది నిజమా కాదా అని నెటిజనులు కూడా అబ్బురపడుతుంటారు.
సోషల్ మీడియా కారణంగానే ఎందరో అద్భుతమైన టాలెంట్లు ఇప్పటికే బయట పడ్డాయి.అయితే తాజాగా అలాంటి అమోఘమైన టాలెంట్‌ను చూపించే ఒక వీడియో వైరల్‌గా మారింది.
ఈ వీడియోకి ఇప్పటికే 5 కోట్ల 40 లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని చూసిన నెటిజన్లు ఇది నిజమా? అని నోరెళ్లబెడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో క్లిప్ ఓపెన్ చేస్తే మనకు ఒక యువతి నీటి అడుగున అప్‌సైడ్ పొజిషన్‌లో క్యాట్‌వాక్ చేస్తూ కనిపించడం చూడవచ్చు.ఈ యువతి నీటి లోపలికి వెళ్లి నీటి ఉపరితలంపై భలే వాక్ చేస్తూ ఆశ్చర్యపరిచింది.
ఇది చూస్తుంటే ఆమెకేమైనా మంత్రవిద్య వచ్చిందా అనే అనుమానం కలగక మానదు.ఈమె తలకిందులుగా వాక్ చేసిన తర్వాత మళ్లీ నీటి అడుగున స్ట్రైట్ గా నడిచేసింది.
ఒక బ్యాగ్ పట్టుకొని ఆమె వాకింగ్ చేస్తూ వావ్ అనిపించింది.ఈ సమయంలో ఆమె హై హీల్స్ కూడా తొడుక్కుంది.
ఈ అద్భుతం చేసిన యువతి పేరు క్రిస్టినా మకుషెంకో.ఈ టాలెంటెడ్ ఉమెన్ ఇప్పటికే 4 సార్లు సింక్రొనైజ్జ్ స్విమ్మింగ్‌లో వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది.ఈ మహిళ నీటి అడుగున ఒక్క వాకింగ్ మాత్రమే కాదు.డ్యాన్స్ కూడా చేయగలదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ లైకులు వచ్చాయి.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.







