సాయి ధరమ్ తేజ్‌కు షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. మామను నమ్ముకుంటే ముంచేశాడంటూ ట్రోల్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పవర్ స్టార్ పవన్ అంటే తెలియని వారుండరని చెప్పవచ్చు.ఎందుకంటే ఈయన ఒక నటుడుగానే కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకుడిగా కూడా ప్రజలకు చేరువయ్యాడు.

 Pawan Kalyan Who Shocked Sai Dharam Tej Trolls Saying That He Would Have Drowned-TeluguStop.com

ఇక పవన్ నటించిన సినిమాలు అన్నీ చాలావరకు మంచి హిట్ అందుకొని మంచి సక్సెస్ గా నిలిచాయి.

అయితే గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాల వైపు అడుగు పెట్టాడు.

దాంతో ఆయన అభిమానులు ఆయన సినిమాలలో నటించడని తెలియటంతో అస్సలు జీర్ణించుకోలేకపోయారు.కానీ ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ తో అడుగు పెట్టాడు పవన్.ఇక తన ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశాడు.ఎంట్రీ తోనే బ్లాక్ బస్టర్ హిట్టు సొంతం చేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకోగా ప్రస్తుతం ఆ సినిమాలతో బిజీగా ఉన్నాడు.పైగా రాజకీయపరంగా కూడా బిజీగా ఉన్నాడు.కానీ తాజాగా పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Telugu Vinodaya Seetha, Bhimla Naik, Pawan Kalyan, Sai Dharam, Vakil Saab-Movie

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సాయి ధరమ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే.పలు సినిమాలలో నటించి నటుడుగా ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.కానీ స్టార్ హోదాను మాత్రం అందుకోలేకపోయాడు.దీంతో ప్రస్తుతం ఆయన స్టార్ హోదా కోసం తెగ ప్రయత్నిస్తున్నాడని చెప్పవచ్చు.

అలా స్టార్ హోదా కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సాయి ధరం తేజ్ కు తన మేనమామ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వచ్చింది.ఇక ఈ సినిమాతో సాయిధరమ్ కు ఎలాగైనా స్టార్డం వస్తుందని అందరూ అనుకున్నారు.

కానీ అంతలోనే పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇంతకు అసలేం జరిగిందంటే.

రీ ఎంట్రీ నుంచి పవన్ కళ్యాణ్ అన్ని రీమేక్ సినిమాలే చేస్తున్నాడు.అలా రీమేక్ సినిమాలతో వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మంచి బ్లాక్ బస్టర్ హిట్టును సొంతం చేసుకున్నాయి.

ఇక వీటితోపాటు మరికొన్ని రీమేక్ సినిమాలు కూడా సైన్ చేశాడు పవన్.అందులో తమిళంలో మంచి హిట్ అందుకున్న వినోదయ సీతం అనే సినిమాను డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో చేయనున్నాడు.

ఈ సినిమాలో కీలక పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ ను తీసుకున్నట్లు తెలిసింది.తన మేనమామ సినిమాలో నటించడానికి సాయిధరమ్ తేజ్ తనకు లైన్లో ఉన్న సినిమాలను కూడా పక్కన పెట్టాడు.

నిజానికి ఈ సినిమా ఆగస్టులోనే ప్రారంభించాలని అనుకున్నారు.కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్ లోకి కూడా వెళ్లలేదు.

నిజానికి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది కూడా తెలీదు.

Telugu Vinodaya Seetha, Bhimla Naik, Pawan Kalyan, Sai Dharam, Vakil Saab-Movie

ఒకవైపు పవన్ మాత్రం రాజకీయలపై బిజీగా ఉన్నాడు.ఆయన తీరు చూస్తే ప్రస్తుతం సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చినట్లు అనుమానాలు వస్తున్నాయి.కానీ తాజాగా.

వాయిదా పెట్టిన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్‌కి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట పవన్.

ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ కావాలని ప్లాన్‌ చేస్తున్నారట.త్వరలోనే ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలిసింది.

కానీ సాయిధరమ్‌తో కలిసి చేయాల్సిన ‘వినోదయ సీతం’ సినిమా గురించి మాత్రం ఏ టాక్ లేదు.దీంతో సాయి ధరమ్ తను ముందు ఫిక్స్ అయినా సినిమాలో షూటింగ్లలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.

ఇంతకాలం మేనమామ సినిమా కోసం ఎదురుచూసిన సాయి ధరమ్ తేజ్ కు పవన్ షాకిచ్చాడు అని.మామను నమ్ముకుంటే ముంచేసాడు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube