ప్రజా గాయకుడు గద్దర్ సరికొత్త లుక్ లో హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.అనంతరం బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో భేటీ అయ్యారు.
ఢిల్లీలోని నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా కృషి చేయాలని బండి సంజయ్ ను గద్దర్ కోరారు.ప్రత్యేక చొరవ తీసుకుని ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, కొత్త గెటప్ లో వచ్చిన గద్దర్ ను చూసి బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు.







