క్లారిటీ మీదున్న జనసైనికులు.. పవన్ నిర్ణయమే తరువాయి?

జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా నానా హంగామా చేశారు.ఆలయాల్లో పూజలు జరిపించి కొబ్బరికాయలు కొట్టారు.

 Jana Sainikulu On Clarity, Pawan Kalyan, Janasena, Jana Sainikulu, Ap Poltics ,-TeluguStop.com

వపన్ నటించే సినిమాలే కాకుండా ఆయన రాజకీయ జీవితం కూడా సాఫీగా సాగాలని కోరుకున్నారట.అంతేకాదండోయ్ రాబోయే ఎన్నికల్లో పవన్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలని.

తమ అభిమాన నటుడు సీఎం కావాలని కూడా కోరుకున్నారట.అయితే, ఇక్కడే ఒక విషయాన్ని వారు స్పష్టం చేస్తున్నారు.

పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తేనే ఆయన సీఎం అవ్వగలరని అంటున్నారట.

జనసేనాని ఏం నిర్ణయం తీసుకుంటారో మరి

జనసేన పార్టీని ఏపీలో మూడవ పార్టీగా వారు అంగీకరించడం లేదంట.

ఏపీ పొలిటికల్ మైదానంలో జనసేన తప్పకుండా ముందుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.పవన్ అభిమానులకు కుల రాజకీయ లెక్కలు, సమీకరణలు పెద్దగా తెలియకపోవచ్చు.విశ్లేషణలు కూడా వారికి పెద్దగా అర్ధం కాకపోవచ్చు.కానీ తమ అభిమాన నాయకుడు మాత్రం ఎలాగైనా ఈసారి రాజకీయాల్లో అనుకున్నది సాధించాలని వారు కోరుతున్నారు.2014లో ఏపీ తెలంగాణ విడిపోయిన సమయంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇచ్చారని.2019 ఎన్నికల్లో వైసీపీకి కూడా అవకాశం ఇచ్చారని.ఇక వచ్చే 2024 ఎన్నికల్లో పవన్‌ను కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు.టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి పెద్దగా జరగలేదని.జనసేన అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని కేడర్ బానే ప్రజల్లోకి వెళ్తుందట.

Telugu Ap Poltics, Chandra Bau, Jana Sainikulu, Janasena, Modi, Pawan Kalyan, So

అంతేకాకుండా పవన్ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని.ఎవరితో పొత్తు లేకుండా బరిలోకి దిగితేనే పార్టీ బలం ఎంత అనేది తెలిసి పోతుందని వారు అంటున్నారు.2019లో ఒంటరిగా బరిలోకి దిగిన జనసేన ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.అప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా రెండు చోట్ల ఓడిపోయారు.అయితే, ప్రస్తుతం జనసేన వైపు ప్రజలు చూస్తున్నారని.జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వర్గం కూడా జనసేన వైపు చూస్తోందని టాక్ వినిపిస్తోంది.దీంతో పవన్ టీడీపీ, బీజేపీతో పొత్తు లేకుండా రావాలని అభిమానులు కోరుతున్నారు.

లేకపోతే మరోసారి తెలుగుదేశం పార్టీకి మేలు జరిగి.ఆయన సీఎం అవుతారని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube