ఫ్లాప్‌ మూడ్‌ లో ఉన్న స్టార్‌ డైరెక్టర్‌ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నాడా?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమా తో మరో ఫ్లాప్ ని మూట కట్టుకున్నాడు.మధ్యలో ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ అయినా కూడా దానిని సద్వినియోగం చేసుకోవడంలో ఈయన విఫలం అయ్యాడు అని చెప్పాలి.

 Puri Jaganadh Going To Do Next Ismart Shankar Movie Part 2, Ismart Shankar,liger-TeluguStop.com

తెలుగులో ఈయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీ దర్శకుడిగా ఒకానొక సమయంలో నిలిచాడు, కానీ ఇప్పుడు ఆయన సంవత్సరంలో కనీసం ఒక్క సినిమా ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోతున్నాడు.అందుకు కారణం హీరోలు ఈయన్ని నమ్మడం లేదు.

విజయ్ దేవరకొండ నమ్మి ఈయనతో సినిమా చేస్తే పరిస్థితి ఏమైందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు మరో సినిమాను ఈయన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

జనగణమన సినిమా ని ఇప్పటికే ఆయన ప్రారంభించాడు, కానీ విజయ్ దేవరకొండ కాస్త సమయం కావాలని కోరడంతో ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ సినిమాను ప్రేక్షక ముందుకు తీసుకు వచ్చేందుకు కథను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.కానీ ఈ సినిమాలో హీరోగా నటించేందుకు రామ్ ఓకే అంటాడా లేదా అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు.

దర్శకుడు పూరి జగన్నాథ్ తో రామ్ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఇద్దరి కాంబినేషన్లో సినిమా సక్సెస్ అయింది కనుక తప్పకుండా రామ్ ఓకే చెప్పే అవకాశం ఉంది.

రామ్ కెరియర్ లో ఒక పెద్ద సినిమాగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది, కనుక ముందు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ సినిమా సమయంలోనే హామీ ఇచ్చాడు.కనుక సీక్వెల్లో ఆయన నటిస్తాడు అంటూ చాలా మంది నమ్మకంగా చెబుతున్నారు.

కానీ ఇప్పటి వరకు రామ్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు అంటూ పూరి సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది.ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్ కోసం స్టోరీ లైన్ రెడీ చేశాడు.

ఆ స్టోరీ లైన్ కి రామ్ ఓకే చెప్తే స్క్రిప్టు పనులు మొదలు అవుతాయి.వచ్చే సంవత్సరం ఆరంభంలోనే సినిమాను పట్టాలెక్కించేలా దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరి రామ్ ఏం చేస్తాడు అనేది చూడాలి.కొందరు మాత్రం లైగర్ సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో పూరి జగన్నాథ్ పిచ్చి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నాడా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూరి అలాంటి వ్యక్తి కాదని కచ్చితంగా ఈసారి సక్సెస్ కొడతాడని అభిమానులు ధీమాతో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube