తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే.మొదట్లో బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అన్న విధంగా కామెంట్స్ వినిపించాయి.
ఆ తర్వాత నెమ్మదిగా కాంట్రవర్సీలు మొదలవడంతో షో నిర్వాహకులకు ప్రాఫిట్స్ కూడా బాగానే వచ్చాయి.అయితే ఇటీవల ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో తప్పితే మిగిలిన అన్ని రీజన్లకు కూడా మంచి రెస్పాన్స్, లాభాలు కూడా వచ్చాయి.
ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంట్రీ విషయంలో ప్రతి సీజన్లో కూడా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.కానీ బిగ్ బాస్ షోలో మొదటి రెండు సీజన్ లను వచ్చినంత క్రేజ్ మిగిలిన మూడు సీజన్లకు రాలేదు అని చెప్పవచ్చు.
అంతేకాకుండా బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లలో మంచి మంచి సెలబ్రిటీలను తీసుకువచ్చిన షో నిర్వాహకులు ఆ తర్వాత సీజన్ లో ఒకరు ఇద్దరిని మాత్రమే మేజర్ హైలేట్ గా ఉండే వారిని తీసుకువచ్చారు.ఇక ఇది ఇలా ఉంటే ప్రతి సీజన్లో కూడా కంటెస్టెంట్లు అడిగినంత పారితోష్కారం ఇచ్చే షో నిర్వహకులు ఈసారి మాత్రం కాస్త పిసినారితనంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మంచి మంచి సెలబ్రిటీలు రాలేదు అన్న టాక్ వినిపిస్తోంది.ఈ సారి హౌస్ లోకి ఎవరో ఇద్దరు ముగ్గురు మాత్రమే తెలిసిన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

కాగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వని ఉండగా అందులో ముగ్గురు కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కాగా ఇందులో ప్రస్తుతం 16 మంది పేర్లు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.శాని సాల్మన్, వాసంతి, శ్రీహాన్, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఆదిరెడ్డి, గీత రాయల్, యాంకర్ నేహా చౌదరి, చలాకీ చంటి, బాలాదిత్య, మెరిన్, రోహిత్, అలాగే విశాల్ రాజశేఖర్, అభినశ్రీ, ఇనియా సుల్తానా ,సింగర్ రేవంత్ లు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.అయితే ఈ సారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఐదుగురికి మాత్రమే ఈసారి వారానికి ఒక లక్ష ఇచ్చే విధంగా అగ్రిమెంట్ అయితే సెట్ అయినట్లు సమాచారం.
ఒకవేళ ఎవరి కారణంగా అయితే రేటింగ్స్ వస్తే మాత్రం పేమెంట్స్ పెంచుతారని, కూడా వార్తలు వినిపిస్తున్నాయి.







