సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.అనంతరం తెలంగాణభవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరగనుంది.
ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, ఈ రెండు కీలక సమావేశాలు ఒకేరోజు నిర్వహించడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు, అసెంబ్లీ సమావేశాల కోసమే కేబినెట్, టీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెడుతున్నట్లు చర్చ జరుగుతుంది.గతంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగియగా.
ఆరు నెలల్లోపు మళ్లీ ప్రారంభం కావాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఈనెల 14లోపు సెషన్స్ ను ప్రారంభించాల్సి ఉంటుంది.
దీనిలో భాగంగానే ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.







