బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం బ్రహ్మస్త్రం. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం మనందరికీ తెలిసిందే.
భారీ బడ్జెట్ తో హైటెక్నికల్ వాల్యూస్ రూపొందించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.కాగా బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాను టాలీవుడ్ దశకుధరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలుగులో ప్రమోట్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమా విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బంధం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో జరగాల్సిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు కావడంతో, ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నువ్వు కాస్త పార్క్ హయాత్ హోటల్ లోకి మార్చారు.ఇక ఈవెంట్ కి బ్రహ్మాస్త్రం సినిమా యూనిట్ తో పాటుగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున దర్శకుడు రాజమౌళి, అలాగే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఇక ఈవెంట్ లో బంగారం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.మొదట ఇక్కడికి రావాలి అనుకున్న అభిమానులు రాలేకపోయినందుకు వారికీ క్షమాపణలు అని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఆర్భాటంగా చేద్దామని అనుకున్నప్పటికీ గణేష్ బందోబస్తు ఉండడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేకపోయారని అందుకే అభిమానుల మధ్య కోలాహలంగా ఈవెంట్ జరపడం కుదరలేదు అని చెప్పుకొచ్చారు తారక్.బాలివుడ్ హీరో రణ్‌బీర్ నటన అంటే తనకు రాక్‌స్టార్ సినిమా నుంచి ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు తారక్.అలాగే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ఒత్తిడిని ఎదుర్కుంటోందని, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని, వారికి గుడ్ అండ్ గ్రేట్ మూవీస్‌ను అందించాలి అని తెలిపాడు తారక్.ఆ తరువాత బ్రహ్మాస్త్రం సినిమా టీమ్ కీ అలాగే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కి అల్ ది బెస్ట్ చెప్పాడు.
ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు తారక్.