ఆ డాన్ ఇంటి చుట్టూ 150 కుక్కలు కాపలా ఉంటాయట... కానీ పోలీసులు ఛేదించారు!

అవును, ఆ డాన్ ని పట్టుకోవడం అంత సులువు కాదు.అతన్ని టచ్ చేయాలంటే ఆ ఇంటి చుట్టూ వున్న దాదాపు 150 కుక్కల్ని దాటి వెళ్ళాలి.

 There Are 150 Dogs Guarding Around That Don's House But The Police Broke It ,-TeluguStop.com

అతని పేరు నరేంద్ర ఆర్య.అతని స్వస్థలం హరియాణా.

గోవాలో సెటిలైన బడా డ్రగ్స్‌ మాఫియా సామ్రాజ్యానికి రారాజు.గోవాలోని ఓ సంపన్న కాలనీలోని అతని నివాసం ఉంటుంది.

కుక్కలతోపాటు పోలీసులు దాడి చేయకుండా అక్కడ భారీ భద్రత కూడా ఉంటుంది.మానవ మాత్రులెవరైనా పొరపాటున ఆ ఇంట్లోకి వెళ్తే.

ప్రాణాలతో బయటపడడం కష్టమే.అచ్చం సినిమాలో విలన్ మాదిరి బిల్డప్ ఆ ఇంటిదగ్గర ఉంటుందంటే మీరు నమ్మితీరాలి.

అలాంటి అడ్డాపై హైదరాబాద్‌ పోలీసులు ధైర్యంగా దాడి చేసి, ఆ డ్రగ్స్‌ మాఫియా కింగ్‌పిన్‌కు బేడీలు వేశారు.

దాదాపు ఓ 40 గంటల పాటు.

ఆ ఇంటి ఆవరణలో.రెక్కీ నిర్వహించి, కుక్కల వలయంలో ఉండి మరీ నిందితుడిని పట్టుకున్నారు.

ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.గోవాలో ఉన్నవాడిని మన హైదరాబాదీ పోలీసులు ఎందుకు పెట్టుకున్నారో తెలియాలంటే మీరు ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.

కొన్నాళ్లక్రితం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, హుమయూన్‌నగర్‌, చాదర్‌ఘాట్‌ ఠాణాల పరిధుల్లో నమోదైన మూడు డ్రగ్స్‌ కేసుల్లో హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌-న్యూ) లోతుగా చేసిన దర్యాప్తుతో.అసలు గుట్టు రట్టయింది.

గోవాలో డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన జాడలు ఉన్నాయని గుర్తించారు.

దాంతో గోవాలో దాడులు జరిపి.

ఇద్దరు కింగ్‌పిన్‌లను అరెస్టు చేయగా.మరో ముఠా నాయకుడు తప్పించుకున్నాడు.

ఈ 3 కేసుల్లో మొత్తం 6 మంది సరఫరాదారులు, 30 మంది వినియోగదారులను పోలీసులు అరెస్టు చేశారు.వారి నుంచి రూ.9లక్షలు విలువ చేసే 140 గ్రాము చరస్‌, 1450 గ్రాముల గంజాయి, 184 ఎల్‌ఎ్‌సడీ బ్లోట్స్‌, 10గ్రాముల MDMA, 7 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ వివరాలు వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌, హుమయూన్‌నగర్‌, చాదర్‌ఘాట్‌ పోలీ్‌సస్టేషన్ల పరిధిలో నమోదైన మూడు డ్రగ్స్‌ కేసుల్లో దర్యాప్తు ప్రారంభించిన హెచ్‌-న్యూ బృందాలు.గోవాలో మూలాలు ఉన్నట్లు కనుకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube