కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసేది నీళ్లా.నిధులా తెలియాల్సి ఉందని బిజెపి నేతలు అంటున్నారు.
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 38వేల 500 కోట్లు రూపాయలు నుంచి లక్షల కోట్లకు పెరగడంలో మర్మమేమిటో తెలియడం లేదని అంటున్నారు.నిర్వాసితులను ఆదుకోవడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని చెబుతున్నారు.
మధ్య మానేరు, మల్లన్న సాగర్, పాలమూరు ,రంగారెడ్డి ,సీతారామ సాగర్ వంటి ప్రాజెక్టుల నిర్వాసితులకు సరైన నష్టపరిహారం అందలేదని బిజెపి నేతలు అంటున్నారు.పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల హక్కులను నియంత్రించాల్సిన బాధ్యతను కేంద్రానికి రాజ్యాంగం కల్పించిందని అన్నారు.
బడ్జెట్లో ప్రస్తావించకుండా కార్పొరేషన్ల పేరుతో అప్పులు తేవడం చట్ట విరుద్ధమని చెబుతున్నారు.ఆ నిధులతో చేసిన పనులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని అన్నారు.దీన్ని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ,మంత్రులు ఎదురుదాడి చేయడం తగదు అని అన్నారు.ఏ రాష్ట్రమైనా ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి లోబడే అప్పులు తేవాల్సి ఉంటుందని బిజెపి నేతలు స్పష్టం చేశారు.
ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.ఈ దశలో రాష్ట్రాన్ని సంస్కరించాల్సింది పోయి దేశమంతా తిరుగుతున్నారని పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి బిజెపి నేతలు వ్యాఖ్యానించారు.
![Telugu Bjp, Mallanna Sagar, Maneru, Palamuru, Ranga, Sitarama Sagar, Trs-Politic Telugu Bjp, Mallanna Sagar, Maneru, Palamuru, Ranga, Sitarama Sagar, Trs-Politic](https://telugustop.com/wp-content/uploads/2022/09/Palamuru-Rangareddy-Sitarama-Sagar.jpg )
ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్న హామీని టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు రైతులు 27,500 కోట్లు రూపాయలు బాకీ పడ్డారన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటుందని బిజెపి నేతలు చెబుతున్నారు.పార్లమెంటులో ఆమోదం పొందిన పథకాల పేర్లు మార్చే అధికారం ఎవరికి లేదని.ప్రధానమంత్రి ఆవాస్ యోజనను రెండు పడక గదుల ఇళ్ల పథకం గా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని అంటున్నారు.
గడిచిన 8 ఏళ్లలో రాష్ట్రంలో ఉపాధి పథకానికి కేంద్రం 20వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెబుతున్నారు.అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయని అంటున్నారు.
పథకాన్ని నీరుగారించేందుకు బృందాలు పర్యటిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం అవివేకం అని బిజెపి నేతలు చెబుతున్నారు.