భార‌త నౌకాద‌ళం అమ్ముల‌పొదిలో మ‌రో అస్త్రం

భార‌త‌ నౌకాదళం అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది.కేరళ కొచ్చిలో ప్రధాని మోదీ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభించారు.దేశీయంగా తయారు చేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ ఐఎన్ఎస్ విక్రాంత్‌కి చాలా స్పెషాలిసిటీస్ ఉన్నాయి.

 Pm Modi Lunched Ins -vikranth-TeluguStop.com

262 మీటర్ల పొడవు, 62 వెడల్పును కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌక, గంటకు గరిష్ఠంగా 28 నాటికల్‌మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.అంటే గంటకు 51.8 కిలోమీటర్ల స్పీడుతో సముద్రంలో దూసుకెళ్తుంది.ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ ఏక‌కాలంలో 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్ల సామ‌ర్థ్యం క‌ల‌ది.45వేల టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, క్షిపణులను లక్ష్యంగా చేసుకోవచ్చు.

ఐఎన్​ఎస్​ విక్రాంత్‌ యుద్ధనౌకలో 14 అంతస్తులు ఉన్నాయి.దీనిలో సుమారు 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.16 పడకలతో ఆసుపత్రి, రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్‌మెషీన్ ఉన్నాయి.ఇక్కడ ఐదుగురు వైద్య అధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు.

అయితే, భారతీయుడి ఆత్మ నిర్భరతకు, మేథస్సుకు ప్రతీకగా ఐఎన్​ఎస్​- విక్రాంత్‌ నిలవనుంది.1971 యుద్ధంలో సేవలు అందించిన దేశ మొదటి విమాన వాహక నౌక.ఐఎన్​ఎస్​-విక్రాంత్‌ పేరుతోనే దీనికి నామకరణం చేశారు.స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక యుద్దనౌక భారత అమ్ముల పొదిలోకి చేరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube