తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రష్మి గౌతమ్ ప్రస్తుతం జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లతో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ షోకీ కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం మనందరికీ తెలిసిందే.కరోనా మహమ్మారి సమయంలో ఆకలితో అల్లాడుతున్న మూగ జంతువులకు ఆహారాన్ని అందించి గొప్ప మనసును చాటుకుంది.
అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మూగజీవాలకు హాని కలిగించే విధంగా ఏదైనా వీడియో వైరల్ అయినా ఫోటోలు వైరల్ అయినా వెంటనే ఆ విషయంపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా రష్మి గౌతమ్ హిందూ వ్యతిరేకి అని ఒక నెటిజన్ కామెంట్ చేయడంతో తనదైన శైలిలో స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది రష్మీ గౌతమ్.
కాగా తాజాగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఒక భారీ వినాయకుడికి కొందరు భక్తులు ఏనుగుతో కలిసి పూలమాలను వేయించారు.ఒకవైపు హెవీ ట్రాఫిక్ మరొకవైపు జనాల మధ్య ఆ గజరాజు ఇబ్బంది పడుతూ ఆ గణేశునికి గజమాలను సమర్పించింది.
ఆ వీడియోని చూసిన రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఆ మాలను సమర్పించే సమయంలో ఆ గజరాజు ఎంతగా ఇబ్బంది పడిందో అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
రష్మి గౌతమ్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఒక నెటిజన్ మీరు జంతు ప్రేమికులేమీ కాదని మాకు తెలుసు.మీరు పక్కా హిందూ వ్యతిరేకులు అని వ్యాఖ్యానించగా.ఆ కామెంట్స్ పై స్పందించిన రష్మీ.
నేను నంది, గోమాతలను గౌరవిస్తాను.ఆ కారణంగానే లెదర్ ఉత్పతులను వినియోగించను.
అంతేకాకుండా పాల పదార్థాలను కూడా తినను.ఎందుకంటే మనం వినియోగించే పాలను ఉత్పత్తి చేయడం కోసం గోమాత ఎన్నోసార్లు గర్భం దాల్చుతుందనే నిజాన్ని నేను భరించలేను.
మహిళగా రుతుక్రమంలో వచ్చే ఆ మూడు రోజుల నొప్పి కూడా నాకెంతో నరకంలా ఉంటుంది అని రాసుకొచ్చింది రష్మి గౌతమ్.
.