రంగ రంగ వైభవంగా ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. యావరేజ్ మూవీ అంటూ?

వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది.క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది.

 Rangaranga Vaibhavamga Movie Plus And Minus Points Details, Ranga Ranga Vaibhava-TeluguStop.com

గిరీశయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రొటీన్ కథతోనే ఈ సినిమా తెరకెక్కిందని నెటిజన్ల నుంచి వినిపిస్తోంది.

అయితే సినిమాలో ఫస్టాఫ్ బాగానే ఉందని సెకండాఫ్ మాత్రం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదని బోగట్టా.తొలి సినిమా ఉప్పెనతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ తర్వాత సినిమాలతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండే రిషి, రాధ పాత్రలలో వైష్ణవ్, కేతిక నటించారు.

సినిమాలో మొదట హీరోహీరోయిన్ల మధ్య గొడవలు జరగగా కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరి కుటుంబాల మధ్య కూడా గొడవలు చోటు చేసుకుంటాయి.

Telugu Girishaya, Kethika Sharma, Rangaranga, Tollywood, Vaishnav Tej-Movie

హీరోహీరోయిన్లు తమ కుటుంబాల మధ్య విభేదాలను తొలగించుకోవడంతో పాటు ప్రేమలో విజయం సాధించడానికి ఏం చేశారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.సినిమాలో కొన్ని కామెడీ సీన్లు బాగానే ఉన్నా మరికొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకునే విధంగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Girishaya, Kethika Sharma, Rangaranga, Tollywood, Vaishnav Tej-Movie

పాటలు, వైష్ణవ్ కేతిక పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు, కొన్ని కామెడీ సీన్స్ ఈ సినిమాకు ప్లస్ కాగా సెకండాఫ్ లో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే రొటీన్ ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు, క్లైమాక్స్ ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చే ఛాన్స్ అయితే ఉందని వైష్ణవ్ తేజ్ ఖాతాలో యావరేజ్ మూవీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube