దర్శకుడు కొరటాల శివ అంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో అభిమానించని అభిమానులు దాదాపుగా ఉండరు అనే సంగతి తెలిసిందే.కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలు ఐదే అయినా ఈ సినిమాలలో నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
వైవిధ్యమైన కథలతో ఏ మాత్రం అసభ్యత లేకుండా కథలను తెరకెక్కించే దర్శకుడిగా కొరటాల శివకు పేరుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో కొరటాల శివ ఒక సినిమాను మించి మరొక సక్సెస్ ను అందుకున్నారు.
కొరటాల శివ సున్నిత మనస్కుడు అని ఇతరులు తన వల్ల హర్ట్ అవుతున్నారని తెలిసినా ఆయన ఎంతగానో ఫీల్ అవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఆచార్య సినిమా వల్ల కొరటాల శివ దర్శకుడిగా విమర్శలు మూటగట్టుకోవడమే కాక ఆర్థికంగా కూడా నష్టపోయారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అయితే ఆచార్య ఫలితంతో సంబంధం లేకుండా తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
అయితే చిరంజీవి మాత్రం ఆచార్య ఫ్లాప్ రిజల్ట్ ను కొరటాల శివ ఖాతాలో వేయడానికి ప్రయత్నించారు.
వాస్తవానికి చిరంజీవి కెరీర్ లో ఆచార్య సినిమాను మించి ఎన్నో డిజాస్టర్లు ఉన్నాయి.ఆచార్య సినిమా కథలో మార్పులు జరగడానికి చిరంజీవి భార్య సురేఖ కారణమని ఈ సినిమా విడుదలకు ముందే వెల్లడైంది.చరణ్ పాత్ర నిడివి పెంచడం వల్లే ఈ సినిమాలో కాజల్ పాత్రను కూడా తొలగించాల్సి వచ్చింది.
ఆచార్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఉంటే చిరంజీవి అప్పుడు మాత్రం దర్శకుడికే పూర్తిస్థాయి క్రెడిట్ దక్కుతుందని చెప్పేవారా అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి స్థాయికి కొరటాల శివ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చిరంజీవికి వయస్సు మీదబడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా చిరంజీవి తనదే బాధ్యత అని చెప్పి ఉంటే హుందాగా ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.