ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్ యువరాజ్ లేఖ రాశారు.
కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమాళ్లపురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ప్రతిపాదనకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
బల్క్ డ్రగ్ పార్క్ ప్రోత్సాహక పథకం కింద ప్రతిపాదిత పార్కులో ఉమ్మడి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు.
స్టీరింగ్ కమిటీ నిర్ణయం ఆమోద యోగ్యమో కాదో వారం రోజుల్లో చెప్పాలని ప్రభుత్వానికి సూచించారు.అదేవిధంగా ఈ పథకానికి ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఇఫ్కీకి మూడు నెలల్లో డీపీఆర్ సమర్పించాలని స్పష్టం చేశారు.







