ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డుప్రమాదంలో పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ మృతిచెందారు.మెల్ బోర్న్ లో బుల్లా డిగ్గర్స్ రెస్ట్ రోడ్డు వద్ద ఈ ఘటన సంభవించింది.
విధులు నిర్వహిస్తున్న కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.నిర్వేయర్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొన్న ఓ వాహనం అనంతరం మరో జీపును కూడా ఢీకొట్టినట్లు గుర్తించారు.
ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.







