తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటించారు.దీనిలో భాగంగా ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేంద్రం పథకాలకు ఒక పేరు పెడితే.రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందన్నారు.
దీనిపై ప్రశ్నిస్తే కేంద్రాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.అదేవిధంగా ఇష్టానుసారంగా ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.







