ఆ ప‌ద‌వులు ద‌క్క‌క‌పోవ‌డంతో.. ఫీల‌వుతున్న వైసీపీ మాజీ మంత్రులు..!!

ఏపీలో మాజీ మంత్రులు ఫీల‌వుతున్నార‌ట‌.జ‌గ‌న్ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ మ‌లివిడ‌త‌లో ప‌ద‌వులు కోల్పోయిన వారికి నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్న ఆశ‌తో ఎదురు చూడ‌గా ఆ ఊసే ఎత్త‌క‌పోవ‌డంతో మాజీలు అస‌హ‌నంతో ఉన్నార‌ట‌.

 Ex-ministers Of Ysp Who Are Not Getting Those Posts Former Ministers, Nominated-TeluguStop.com

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మంత్రి వర్గ విస్తరణను జగన్ చేపట్టారు.నాడు చాలా మంది మంత్రులను ప‌క్క‌న పెట్టేశారు.

అయితే వారికి ఓదార్పుగా నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పారు.దాని వల్ల వారికి అధికార హోదా ఉంటుందని ప్రోటోకాల్ సమస్యకు కూడా ఇబ్బంది రాకుండా ఉంటుందని నచ్చచెప్పారు.

అయితే ఇప్పటికి అయిదు నెలలు గడచినా ఆ పదవుల ఊసు లేక‌పోవ‌డంతో ర‌గిలిపోతున్నార‌ట‌.జిల్లా అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని నాడు వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా ప్రచారం సాగింది.

ఈ పదవులలో చైర్మన్లుగా మాజీ మంత్రులు ఉంటారని వారికి క్యాబినేట్ హోదా దక్కుతుందని కూడా ఆశలు కల్పించారు.

ఇక ఆ ప‌ద‌వులు ఉండ‌వా

తీరా చూస్తే ఆ పదవులు మొత్తానికి ఉండ‌బోవ‌నే చర్చ సాగుతోంది.

నిజానికి రాష్ట్ర అభివృద్ధి బోర్డుని ఒక దాన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా కొడాలి నానిని నియమించాలని జగన్ అనుకున్నారు.కొడాలి నాని జగన్ అంటే చాలా అభిమానం చూపిస్తారు.

ఆయన కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు.ఆయన జగన్ని ఎవరైనా ఏమైనా అంటే అసలు ఊరుకోరు కూడా.

ఇక కమ్మలలో ఆయన సరిసాటి నేత కూడా మరొకరు లేకపోవడంతో ఆయన మంత్రి పదవి కూడా కంటిన్యూ అవుతుందని అంతా అనుకున్నారు.కానీ అనుహ్యంగా కొడాలిని తప్పించేశారు.

దాంతో ఆయనతో పాటు అంతా షాక్ అయ్యారు.కొడాలి నానిని తీసేయడంతో జగన్ మంత్రివర్గంలో కమ్మలు లేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది.

దాంతో దాని మీద పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగడంతో కొడాలి నానికి వేరే కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారని అంతా అనుకున్నారు.

బోర్డు చైర్మ‌న్ ఇస్తార‌ని

అలా ముందుకు వచ్చిందే రాష్ట్ర అభివృద్ధి బోర్డు చైర్మన్ పదవి.

అయితే ఈ పదవి కోసం జగన్ నానితో మొదట్లోనే సంప్రదింపులు జరిపారని అంటున్నారు.అయితే నాని మాత్రం తనకు ఏ పదవీ అక్కరలేదని తాను గుడివాడ ఎమ్మెల్యేగానే ఉండిపోతాన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఆయనకు మంత్రి పదవి పోవడం తో కొన్నాళ్ళ పాటు బాధ పడ్డారని ఇపుడు ఆయన సర్దుకుపోయారని అంటున్నారు.అయితే కొడాలి నానితో ముడిపెట్టి మాజీ మంత్రులు అందరికీ క్యాబినేట్ ర్యాంక్ కలిగిన పదవులు ఇస్తామని నాడు పార్టీ హామీ ఇచ్చిందని అంటున్నారు.

నాని నుంచే రివర్స్ లో జవాబు రావడంతో అధినాయకత్వం ఆ ప్రతిపాదన మానుకుంది అని అంటున్నారు.దాంతో కొడాలి నాని విషయం ఎలా ఉన్నా తమకు పదవి నోటి దాకా వచ్చి పోయింది అన్న బాధ అయితే చాలా మంది సీనియర్లలో ఉంది అంటున్నారు.

Telugu Status, Cm Jagan, Councils, Ministers, Kodali Nani, Council-Political

రాష్ట్ర అభివృద్ధి బోర్డుని కనుక ఏర్పాటు చేస్తే దానికి అనుబంధంగా జిల్లా బోర్డు పదవులు కూడా దండీగా వస్తాయని అంతా ఆశించారు.ఇప్పటికే పదమూడు జిల్లాలు కాస్తా ఇరవై ఆరుగా పెరిగాయి.దాంతో చాలా పదవులు వచ్చేవి అన్న ఆలోచన అయితే పార్టీ నేత‌ల్లో ఉంది.మరి కొడాలి నాని నో చెప్పడంతోనే ఇదంతా ఆగిందా.లేక హై కమాండ్ ఆలోచన కాస్తా మారిందా అన్న చర్చ కూడా జ‌రుగుతోంది.ఏదేమైనా మాజీ మంత్రుల‌కు ప‌ద‌వులు ద‌క్క‌క‌పోవ‌డంతో తెగ ఫీల్ అవుతున్నార‌ట.

ఎన్నికలకు మరో ఏడాదిన్నర టైమ్ మాత్రమే ఉన్న వేళ ప‌ద‌వులు క‌లిపిస్తారా.లేదా అన్న ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌.

మాజీ మంత్రుల‌ను మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ టైమ్ లో కూల్ చేసినా.ఇప్పుడు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ర‌గిలిపోతున్నార‌ట‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube