తెలుగు బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ గ్లామర్ బ్యూటీ గా శ్రీముఖి బాగా ఏలుతుంది.ఇక ఈమె పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తన మాటలతో, అల్లర్లతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని వారిని తన అభిమానులుగా మార్చుకుంది.ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తను కూడా ఇండస్ట్రీలో ఒక పేరు సంపాదించుకుంది.
కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.ప్రస్తుతం పలు షో లతో బాగా బిజీగా ఉంది.ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఇంట్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.
అదుర్స్ షోతో కెరీర్ ప్రారంభించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఇందులో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాస్ షోలో తన యాంకరింగ్ తో అందరి దృష్టిలో పడింది.
అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.శ్రీముఖి ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా సంపాదించుకుంది.
ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి బాగా సందడిగా ఉంటుంది.ఇక గతంలో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.ఆ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.
తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.ఇక సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ తో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.

అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను మతి పోగొడుతుంది.అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతుంది.
ఇక ఫోటో షూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.
అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.ఈమధ్య పలు కొత్త షోలల్లో కూడా అడుగు పెట్టి బాగా సందడి చేస్తుంది.
ఇదిలా ఉంటే కొన్ని కొన్ని సార్లు శ్రీముఖి బాగా ట్రోల్స్ కి కూడా గురవుతుంది.అయినా కూడా వాటిని పట్టించుకోదు శ్రీముఖి.

ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా వినాయక చవితి రోజున కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.దీంతో ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు బాగా కామెంట్లు పెడుతున్నారు.ఇక ఒక నెటిజన్ మాత్రం క్లాస్ పీకారు.ఇంతకు అసలేం జరిగిందంటే.అరే శ్రీ ఈరోజు నువ్వు ఫొటోస్ షేర్ చేయకురా.గణేష్ చతుర్దశి రోజు చందమామని చూడకూడదు అంటారు.
అని కామెంట్ చేయడంతో.తనను ఆ నెటిజన్ చందమామతో పోల్చారు.
ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.ఇక మరికొందరు నిజమే అది పాపం అని నీకు తెలియదా శ్రీముఖి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







