మహిళల భద్రతకు మరింత రక్షణగా షీ టీమ్ పనిచేయాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆదేశించారు.మహిళలపై దాడులు, వేధింపులు, ఆడపిల్లల పట్ల ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్ పనితీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.మహిళలపై ఆగడాలు హద్దుమీరితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
విద్యార్థినులను వేధించే, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షించడం, ఈవ్‌టీజర్ల తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం, మళ్లీ పట్టుబడితే తీవ్రమైన కేసును నమోదు చేయడం షీటీమ్స్ ముఖ్య బాధ్యతలని అన్నారు.జిల్లాలో షీ టీమ్స్ పటిష్టంగా పనిచేస్తోందని, గడిచిన ఎనిమిది నెలల్లో నమోదైన కేసులే ఇందుకు ఉదాహరణ అన్నారు.
ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడే వారిని ఊపేక్షించకుండా వారిపై కేసులు నమోదు చేస్తోందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు టీమ్స్ పనిచేస్తున్నాయని.
షీ టీమ్స్ స్టార్ట్ అయిన కొత్తలో దాదాపు అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవని.కానీ జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చిందన్నారు.
గతంలో మైనర్లు క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయ్యేవారని తెలిపారు.షీ టీమ్స్ ఇలాంటి కేసుల్లో పేరెంట్స్‌కి కౌన్సిలింగ్ ఇవ్వడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు.
ఈ ఏడాది తొలి 8 నెలల్లో మొత్తం 8 FRI, 12 petty కేసులు వస్తే …అందులోని ఆకతాయిలు, పోకిరీలను షీ టీమ్స్ వ్యవస్థ కేసులు నమోదు, కౌన్సిలింగ్ చేసిందన్నారు.
ఈ ఆగష్టు నెలలో ఏడు ఫిర్యాదు వచ్చాయని కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు.
గతంలో ఎవరైనా వేధిస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి మహిళలు ముందుకొచ్చే వాళ్లు కాదని…కాని ఆన్‌లైన్‌లో, వెబ్ సైట్ ద్వారా అవగాహన కల్పించడంతో ఫిర్యాదులు చేయడానికి ధైర్యంగా ముందుకొస్తున్నారని అన్నారు.ఇప్పుడు ఎక్కువగా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు… ఏదైనా సమస్య వస్తే వెంటనే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి… ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటుందని కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నారు.







