అజాదీగా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమానికి గత నెలలో చంద్రబాబుకి ప్రధాని మోడీ నుండి ఆహ్వానం రావడం తెలిసిందే.చాలాకాలం తర్వాత ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ కావడం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపింది.
దాదాపు చంద్రబాబు నీ పక్కకు తీసుకెళ్లి ఒక ఐదు నిమిషాలు పాటు ప్రధాని మోడీ ముచ్చటించినట్లు కూడా వార్తలు వచ్చాయి.ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్ర బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తో టీడీపీ జతకలసి పోటీకి దిగుతున్నట్లు ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
ఇక ఇదే సమయంలో బీజేపీకి అనుకూల మీడియా పేరున్న రిపబ్లిక్ టీవీలో కూడా పలు కథనాలు రావడంతో ఈ వార్త సంచలనం రేపింది.ఇదే సమయంలో ఇటీవల హైదరాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంతో ఈ వార్తలు మరింతగా బలపడ్డాయి.
కచ్చితంగా వచ్చే ఎన్నికలలో గతంలో మాదిరిగానే టిడిపి- జనసేన- బిజెపి కలిసి పోటీ చేయనున్నట్లు.ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనేక కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి.

ఇటువంటి తరుణంలో బీజేపీ ఏపి కో ఇన్ చార్జి సునీల్ థియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్డీఏతో టీడీపీ కలుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు.పొత్తుల అంశంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.అజాదీగా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ… చంద్రబాబును మాత్రమే కలవలేదని చాలామంది నాయకులను కలిశారని గుర్తు చేశారు.
అనవసరంగా దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కుటుంబాల పార్టీలు అవినీతి పార్టీలని సునీల్ థియోధర్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.







