పీకే ప్లాన్ ప్ర‌కారమే టీఆర్ఎస్, బీజేపీ ప‌రస్ప‌రం విమ‌ర్శ‌లు

టిఆర్ఎస్, బిజెపి కలిసి తెలంగాణలో పశ్చిమబెంగాల్ మోడల్ ను అమలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.రెండు పార్టీల మధ్య పోలింగ్ పోలరైజేషన్ జరిగి కేసీఆర్ అధికారం నిలబడాలని.

 Trs And Bjp Criticize Each Other According To Pk Plan , Trs,bjp, Pk Plan, Congre-TeluguStop.com

ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి రావాలని.అన్నదే వాటి వ్యూహం అని పీకే ప్లాన్ ప్రకారం రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ ఇదే వ్యూహాన్ని అనుసరించి తన అధికారం నిలబెట్టుకున్నారని ప్రధాన ప్రతిపక్షంగా బిజెపి వచ్చేలా చూసుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

తెలంగాణను కాంగ్రెస్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు టిఆర్ఎస్, బిజెపి కలిసి వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని మోడీ, కెసిఆర్ ఓకే నాణాల‌కి బొమ్మ బొరుసు లాంటి వారని అంటున్నారు.మునుగోడు ఉప ఎన్నికల కోసం మండల వారీగా నియమించిన ఇన్చార్జిలతో గాంధీభవన్ నుంచి జూమ్ యాప్ ద్వారా రేవంత్ రెడ్డి, పార్టీ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, మాజీమంత్రి దామోదర్ రెడ్డి, ఎఐసిసి కార్యదర్శి బోసురాజు తదితరులు సమావేశం అయ్యారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని సరైన సమయంలో నిర్ణయించి ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు.

Telugu Cm Kcr, Congress, Damodar Reddy, Mamata Banerjee, Pk, Prime Modi, Revanth

మునుగోడు నియోజకవర్గంలో మండల వారీగా నియమించిన పార్టీ ఇన్చార్జిలు సెప్టెంబర్ ఒకటి నుంచి గ్రామ గ్రామాన పర్యటించనున్నట్లు చెప్పారు.మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు ధరల పెరుగుదల నిరుద్యోగం శాంతిభద్రతల విష‌యాల‌పై చర్చ జరగకుండా బిజెపి టిఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నారని అంటున్నారు.మునుగోడులో పార్టీ ఫిరాయింపుల కోసం ఆ రెండు పార్టీలు కమిటీలను నియమించుకున్నాయని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపైన ఒత్తిడి తెచ్చి నజరాణాలు ఇచ్చి కొనే ప్రయత్నాలు రెండు పార్టీలు చేస్తున్నాయని ఒక్కో నాయకుడికి 40 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల ధర చెల్లిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

మునుగోడు అభ్యర్థికి సంబంధించి ప్రతిపాదనలను ఏఐసీసీకి పంపామని ఏఐసీసీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని నేతలు చెబుతున్నారు.రాష్ట్రంలో గిరిజన జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచకుండా మునుగోడులో ఓట్లు అడిగే హక్కు బిజెపి టిఆర్ఎస్ లకు లేదన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube