జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించిన ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది .బిజెపి , జనసేన పార్టీలు ఏపీలో పొత్తు పెట్టుకున్నాయి .కలిసి మొదట్లో కొన్ని కార్యక్రమాలను చేపట్టాయి.2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని అటు బిజెపి ఇటు జనసేన ప్రకటనలు చేస్తూనే ఉన్నాయి.2019 ఎన్నికల అనంతరం బిజెపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.అయితే ఈ రెండు పార్టీల మధ్య అంత సఖ్యత కనిపించడం లేదు.
విడివిడిగానే ఏపీలో అనేక కార్యక్రమాలు రెండు పార్టీలు చేపడుతున్నాయి.ప్రజా ఆందోళనలు, ఉద్యమాలు, ధర్నాలు ఎలా ఏదైనా బిజెపి , జనసేన పార్టీలు విడివిడిగానే చేపడుతున్నాయి.
పొత్తు ఉన్నా, లేనట్టుగానే వ్యవహరిస్తున్నాయి.అంతేకాదు జనసేన , బిజెపి పొత్తు కుదిరిన తరువాతి నుంచి బిజెపి అగ్ర నేతలు ఎవరు పవన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోగా, అనేకసార్లు అవమానించినట్టు గా వ్యవహరించడం పై జన సైనికులు మండిపడుతున్నారు.
ఇది ఇలా ఉంటే కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ కు వచ్చిన సందర్భంగా, సినీ హీరో ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి.
వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనేది స్పష్టత లేనప్పటికీ ఖచ్చితంగా రాజకీయ అంశంపైనే చర్చ జరిగిందని, టిడిపిలో ఎన్టీఆర్ యాక్టివ్ అవుతారని , ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ కు అమిత్ షా హితబోధ చేశారని ప్రచారం నడిచింది.సినీ హీరో నితిన్ తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఏ విషయంపై వీరి మధ్య చర్చ జరిగింది అనేది స్పష్టత లేదు.పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అమిత్ షా ప్రయత్నించకపోవడం , పార్టీలతో సంబంధం లేని హీరోలకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం తదితర అంశాలపై జనసైనికులు మండిపడుతున్నారు.

వాస్తవంగా చెప్పుకుంటే పవన్ కు ఉన్నంతగా అభిమానులు మరి ఏ హీరోకు లేరు.పవన్ ఇమేజ్ ను వాడుకోగలిగితే బిజెపికి అది ప్లస్ పాయింట్ అవుతుంది.అమిత్ షా జేపీ నడ్డా వంటి వారు సినీ హీరోలను కలుస్తున్న , వారి కంటే ఎక్కువగా పవన్ కలవడం ద్వారానే బిజెపికి కలిసి వస్తుంది.కానీ ఆ అంశంపై వారు దృష్టి పెట్టకుండా పవన్ నుపట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తుండడం తమతో పొత్తు పెట్టుకున్న పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడం వంటివి జనసేన ఆగ్రహం కలిగిస్తోంది.
బిజేపి ఈ విధంగా పవన్ తో వ్యవహరించడం అంతిమంగా ఆ పార్టీకే ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉండగా, పవన్ కు మాత్రం ఢిల్లీ పెద్దల దర్శనం దక్కకపోవడం అవమానం కలిగిస్తోంది.







