త్రివిక్రమ్ సినిమాలో హీరో తరుణ్ నటిస్తున్నాడా? ఇదిగోండి అసలు వాస్తవం!

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

 Hero Tarun Entry In Mahesh Trivikram Movie Details, Mahesh Babu, Tarun, Clarity,-TeluguStop.com

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తనకు సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.కాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న విషయం మనందరికీ తెలిసిందే.

కాగా ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో అతడు ఖలేజా లాంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ హ్యాట్రిక్ సినిమా ఇది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ రూపొందిస్తోంది.కాగా ఈ సినిమాకు షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

ఇందులో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ హీరో తరుణ్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ విషయంపై స్పందించిన తరుణ్.సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజం లేదని.ఆ సినిమా కోసం తనను ఎవరు సంప్రదించలేదని తరుణ్ చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా తనకు సంబంధించిన ఎటువంటి వార్త అయినా కూడా తప్పకుండా అభిమానులతో పంచుకుంటాను అని తెలిపారు తరుణ్.

Telugu Tarun, Mahesh Babu, Maheshbabu, Ssmb, Tollywood-Movie

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోయిన తరుణ్ ఆ తర్వాత కాలంలో నెమ్మదిగా సినిమాలలో కనిపించడం తగ్గించేశారు.ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.కాగా హీరో తరుణ్ అభిమానులు తరుణ్ మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చి హీరోగా సినిమాలు చేస్తే చూడాలి అని చాలామంది అభిమానులు కోరుకుంటూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి మహేష్ బాబు సినిమాలో తరుణ్ ఇస్తున్నాడు అన్న వార్త నిజం కాదు అని తేలిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube