ఏపీలో గైనకాలజిస్టులు, మత్తు మందు డాక్టర్లు లేరని వస్తున్న వార్తల్లో నిజం లేదని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.వైద్య శాఖలో మూడేళ్లలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
అదేవిధంగా పీహెచ్సీలో టెలి హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.రూ.16,255 కోట్లతో అన్ని స్థాయిల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.గిరిజన ప్రాంతాల్లో వైద్యులను ప్రోత్సహించేందుకు ఎక్కువ జీతాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
అదేవిధంగా స్పెషలిస్టుల కొరత తీర్చేందుకు ఏడాది పాటు పీజీ విద్యార్థులకు రూరల్ ఏరియాలో సర్వీస్ చేసేలా ఆదేశాలు ఇస్తామన్నారు.ఏరియా ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ చికిత్సలు పెరుగుతున్నాయని తెలిపారు.
వచ్చే రెండు సంవత్సరాలలో ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల రూపరేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు.







