యాంకర్ వాయిస్ తూర్పుగోదావరి జిల్లా హరితహారం కడియం నర్సరీలో గ్రీన్ గణేశుడు సందడి చేసాడు.పచ్చని కాన్వాసులో భక్తులకు దర్శనం ఇచ్చాడు.
గణేష్ చవితి వస్తే అంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.వాయిస్ ఓవర్ కడియపులంక సత్యదేవ నర్సరీలో ప్రత్యేకత కోసం మొక్కలు,పూలతో ఏకో గణపతిని తీర్చిదిద్దారు.
శ్రీ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యదేవా నర్సరీలో “మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో రైతు పుల్లా ఆంజనేయులు వివిధ రకాల పూలతో మొక్కలతో వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దారు.భక్తులందరూ మట్టి వినాయక ప్రతిమను నిలబెట్టి పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యం నివారణకు సహకరించాలని తెలిపారు.
కాగా మొక్కలతో తీర్చిదిద్దిన గ్రీన్ వినాయకుడిని చూసేందుకు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు.







