సునీల్ దశ తిరిగిపోయిందా.. ఆ నలుగురు స్టార్ హీరోలు సునీల్ కు ఛాన్స్ ఇస్తున్నారా?

ఒకప్పుడు కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సునీల్ కు ప్రస్తుతం ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.సునీల్ వరుసగా సినిమాలలో నటిస్తున్నా తన పాత్రలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Comedian Sunil Got Continuous Movie Offers Details, Sunil, Actor Suneel, Sunil M-TeluguStop.com

అయితే ప్రస్తుతం సునీల్ వరుసగా నలుగురు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నారు.ఈ నాలుగు సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రం సునీల్ కెరీర్ కు కచ్చితంగా బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

పుష్ప ది రైజ్ లో సునీల్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.మంగళం శ్రీను పాత్రలో అద్భుతంగా నటించిన సునీల్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

పుష్ప ది రూల్ లో కూడా ఈ పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.శంకర్ రామ్ చరణ్ సినిమాలో కూడా సునీల్ నటిస్తుండగా సునీల్ కెరీర్ కు ప్లస్ అయ్యే విధంగానే ఈ పాత్ర ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలలో సునీల్ ఛాన్స్ ను సొంతం చేసుకున్నారని బోగట్టా.

Telugu Suneel, Atau, Ntr, Khaleja, Koratala Siva, Maheshbabu, Pushpa Rule, Rc, S

త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో కూడా సునీల్ ఎంపికయ్యారని సమాచారం అందుతోంది.అతడు, ఖలేజా సినిమాలలో సునీల్ పాత్రకు మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమా కూడా నటుడిగా సునీల్ రేంజ్ ను పెంచే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Suneel, Atau, Ntr, Khaleja, Koratala Siva, Maheshbabu, Pushpa Rule, Rc, S

తారక్ కొరటాల శివ కాంబో మూవీలో సైతం సునీల్ కీలక పాత్రకు ఎంపికయ్యారని తెలుస్తోంది.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో ఆఫర్లను సొంతం చేసుకుంటూ సునీల్ సత్తా చాటుతున్నారు.ప్రస్తుతం సునీల్ నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే సునీల్ రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube