ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్టార్ హీరోల పుట్టిన రోజు వేడుకలను వారి వారి అభిమానులు చాలా విభిన్నంగా జరుపుకుంటూ ఉన్నారు.అందులో ముఖ్యంగా ఆ స్టార్ హీరోలు నటించిన పాత సినిమాలను భారీ ఎత్తున రిలీస్ చేసి పండుగ చేసుకుంటున్నారు.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి మరియు ఒక్కడు సినిమాలను తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా విడుదల చేసి పుట్టిన రోజు నాడు సందడి చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు ఏదైతే చేశారో అందరూ హీరోల అభిమానులు కూడా అదే చేస్తున్నారు.
మొన్న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఘరానా మొగుడు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో స్క్రీనింగ్ చేసిన విషయం తెలిసిందే.ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు జల్సా మరియు తమ్ముడు సినిమాలను స్క్రీనింగ్ చేసేందుకు గాను ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ఇక అతి త్వరలోనే రాబోతున్న ప్రభాస్ పుట్టిన రోజుకు ఆయన అభిమానులు అంతే భారీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రం బిల్లా సినిమా స్క్రీనింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన స్టార్ట్‌డమ్ ని అమాంతం పెంచిన బిల్లా ప్రత్యేకమైన సినిమా అనడం లో సందేహం లేదు.అందుకే ఆ సినిమా ను ఇప్పుడు ప్రభాస్ అభిమానులు పుట్టిన రోజు సందర్భంగా చూడాలని ఆశపడుతున్నారు.
అందుకే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా ను రిలీజ్ చేసే విధంగా నిర్మాతలను ఒప్పించారు.అంతే కాకుండా ప్రభాస్ అభిమాన సంఘం నాయకులు ఆ సినిమా ను ప్రత్యేకంగా థియేటర్లలో విడుదల చేయాలని కూడా భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
మొత్తానికి ప్రభాస్ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు చేస్తున్న సందడి ఆయన పుట్టిన రోజు నాడు ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.







