1.పోటీ పరీక్షలకు అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ మెటీరియల్
పోటీ పరీక్షల కోసం అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ మెటీరియల్ ను సిద్ధం చేసింది.ఈ మెటీరియల్ ధరను 1100 గా నిర్ణయించింది.
2.గవర్నర్ కు ‘ కాగ్ ‘ ఆడిట్ నివేదిక
2020 -21 ఆర్థిక సంవత్సర రెవెన్యూ వ్యయాలకు సంబంధించిన ‘ కాగ్ ‘ ఆడిట్ నివేదిక ను తెలంగాణ అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులు గవర్నర్ కు సమర్పించారు.
3.ఇంటింటికి కాంగ్రెస్
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
4.ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి.
5.హరీష్ రావు రఘునందన్ ఆగ్రహం
బిజెపిపై అనేక అంశాలపై విమర్శలు చేసిన తెలంగాణ మంత్రి హరీష్ రావు పై దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు చేశారు.హరీష్ రావు ఎక్కడ సమయం దొరికితే అక్కడ కేంద్రంపై అబద్ధాల విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
6.టిఆర్ఎస్ ఎల్ఫీ సమావేశం
సెప్టెంబర్ మూడో తేదీన టిఆర్ఎస్ సెల్ఫీ సమావేశం నిర్వహించబోతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.
7.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
8.తిరుమల సమాచారం
తిరుమలలో నేడు వరాహ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
9.కుప్పంలో చిరుత కలకలం
చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.పెద్దపులి భయంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
10.నేడు పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటన
నేడు పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించరున్నారు.జిల్లా కలెక్టరేట్ ను ఆయన ప్రారంభించనున్నారు.
11.చలో విజయవాడ వాయిదా
సిపిఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం వాయిదా పడింది.ఈ మేరకు ఏపీ సీపీఎస్ ఈఏ ఉద్యోగులు ఒక ప్రకటన జారీ చేశారు.
12.గణేష్ ఉత్సవాలపై మంత్రి తలసాని సమావేశం
గణేష్ ఉత్సవాలపై బుద్ధ భవన్లో జిహెచ్ఎంసి అధికారులతో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం అయ్యారు.
13.ఉత్తంకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుంది అని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ఉత్తమ్ కుమర్ రెడ్డి అన్నారు.
14.కెసిఆర్ పై సంజయ్ కామెంట్స్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీటర్లు పెడుతుండడంతో సీఎం కేసీఆర్ గజగజ వణుకుతున్నారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి విమర్శించారు.
15.ఇండోనేషియా సదస్సుకు నాలుగు స్టార్టప్స్ ఎంపిక
ఇండోనేషియాలో సెప్టెంబర్ 2- 4 వరకు జరగనున్న డిజిటల్ ఇన్నోవేషన్ నెట్వర్క్ సదస్సుకు తెలంగాణ ఏఐ మిషన్ ప్రోత్సహిస్తున్న నాలుగు స్టాటస్ ఎంపికయ్యాయని ఐటి పరిశ్రమల శాఖ కార్యదర్శి జాయేస్ రంజాన్ తెలిపారు.
16.ఎండి ఎం కు 50 కోట్లు విడుదల
మధ్యాహ్నం భోజనం పథకానికి 50.31 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
17.రఘురామ కామెంట్స్
ప్రభుత్వ ఉద్యోగులపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది అని నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
18.జగన్ పై చంద్రబాబు ఆగ్రహం
జగన్ రెడ్డి పంతమే ఫైనల్ కాదు అని పైన న్యాయవ్యవస్థ ఉందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.
కొవ్వూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తీర్పు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందించారు.కొవ్వూరు బ్యాంక్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
19.ఏపీపీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ విడుదల
గతంలో ప్రకటించిన పలు నోటిఫికేషన్ల పరీక్షల షెడ్యూల్ ఏపీపీఎస్సీ విడుదల చేసింది.2021 లో ఇచ్చిన 12 ,13, 16 ,17, 19, 20, 21, 2002లో ఇచ్చిన నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 11 వరకు జరుగుతాయని వివరించింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,250 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,540
.