నల్లగొండ జిల్లా:ఎటువంటి విఘ్నాలు కలుగకుండా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.కరోనాతో గడిచిన రెండు సంవత్సరాలుగా ఇంటికే పరిమితమైన వినాయక చతుర్ధిని ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సకల శాస్త్రాలకు అధిపతిగా కొలువుదీరిన ఆదిదేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ప్రార్దిస్తున్నన్నారు.ఏకదంతుడి దీవెనలతో ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసిలా గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.







