ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.ప్రస్తుత రోజుల్లో ఎప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
అందువలన తమ తమ ఆరోగ్యం, ఎత్తు బరువు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు.అయితే మనుషులే కాదండోయ్.
జంతువులు కూడా తగిన ఎత్తు బరువు ఉండాలంట.
మీరే కాదు.
మేము కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటాం, మీరు మాతో పోటి పడగలరా అంటూ జంతువులు హైట్ కొలుచుకుంటున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.మీరేనా మీకంటే మేము స్లిమ్‌గా ఉంటాం.
అంటూ జంతువులు చేస్తున్న పనికి అందరూ షాక్ అవుతున్నారు.ఎక్కడా తగ్గేదే లేదంటూ, మనుషులు సమయానికి ఎలా జిమ్‌కి వెళ్తారో.
జంతువులు కూడా అంతే సమయానికి వచ్చి వాటి ఎత్తు, బరువు కొలుచుకొని మళ్లీ వెళ్లి పోతుంటాయి.ఇది ఎక్కడనుకుంటున్నారా.? బ్రిటన్‌లోని జడ్ ఎస్ ఎల్ లండన్ జంతు ప్రదర్శన శాలలో జంతువులు, బరువును కొలిచి వాటి ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జంతు ప్రదర్శనశాలలో అధికారులు వాటి ఎత్తు, బరువులలో తేడా రాకుండా.
వాటి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు.ఇక అంతరించిపోతున్న మూడు పులి పిల్లలకు ఇటీవలే జన్మనిచ్చిన సుమత్రన్ పులి గయ్షా తన ఎత్తును కొలుచుకుంటున్న వీడియో నెట్టింట్లో సందడి చేస్తుంది.
పులి మాత్రమే కాకుండా పెంగ్విన్‌లు కూడా తాము ఒడ్డుకు వచ్చి, బరువును కొలుచుకొని ఆహారం తీసుకొని వెళ్లిపోతున్నాయి.ఇక ఇలా జంతువులు తమ బరువును కొలుచుకుంటూ.
వాటి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది.ఈ రోజుల్లో మనుషులు కూడా వీటిలా సమయపాలన పాటిస్తూ.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోరేమో.ఈ జంతువులు గ్రేట్ అంటూ ముచ్చటిస్తున్నారు.
మరీ ఇంకెందుకు లేటు ఈ వీడియో చూసి దీనిపై మీ భిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.







