ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన సమ్మెట గాంధీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.షూటింగ్ లలో అత్యంత అవమానకరంగా ఫీలైన సందర్భం ఏదీ లేదని ఆ పరిస్థితిని నేను తెచ్చుకోనని సమ్మెట గాంధీ అన్నారు.
ఎవరిని తూలి ఒక మాట అనడం నేను చేయనని ఆయన కామెంట్లు చేశారు.నిర్లక్ష్యంగా మాట్లాడటం నేను చేయనని అందరితో నేను సరదాగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు.
దర్శకులు అందరూ ఒకే విధంగా ఉండరని కొంతమంది చెప్పిందే చేయాలని అనుకుంటారని ఆయన తెలిపారు.ఆ విధంగానే మనం చేయాలని ఆయన చెప్పుకొచ్చారు.నాకు స్టేజ్ ఫియర్ లేదని ఆయన కామెంట్లు చేశారు.నేను రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కూడా చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
నా వైఫ్ నుండి కూడా సపోర్ట్ ఉందని ఆయన వెల్లడించారు.రాజన్న సినిమాలో నాగార్జునతో ఒక సీన్ చేశానని ఆయన తెలిపారు.

నాగార్జున నన్ను స్టేజ్ ఆర్టిస్టా అని అడిగి అవునని చెప్పిన వెంటనే స్నేహను పిలిచి అతను స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి డైలాగ్ ఎలా చెప్పాడో చూడు అని అన్నారని సమ్మెట గాంధీ వెల్లడించారు.ఆ సమయంలో చాలా థ్యాంక్స్ సార్ అని నాగార్జునతో చెప్పానని ఆయన తెలిపారు.నాగార్జున నుంచి అభినందన లభించిందని ఆయన చెప్పుకొచ్చారు.రాజన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ బాగా చేసిందని ఆయన తెలిపారు.

రాజన్న సినిమా తర్వాత నాకు మా ఊరిలో సన్మానం చేశారని ఆయన చెప్పుకొచ్చారు.రాజన్న సినిమా తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు.సమ్మెట గాంధీ ప్రస్తుతం వరుసగా సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్నారు.సమ్మెట గాంధీ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







