సోషల్ మీడియాలో ఎప్పుడు ఏవి వైరల్ అవుతాయో చెప్పడం కష్టం.ఏంటో శ్రమకోర్చి చేసిన వీడియోలు ఎవ్వరూ చూడరు.
ఏదో యాదృచ్చికంగా జరిగిన సన్నివేశాలను మాత్రం మళ్లీమళ్లీ చూస్తారు.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ లోని చింద్వారా – నాగపూర్ హైవేపై ఓ కారు వేగంగా దూసుకు వస్తోంది.ఇంతలో అనూహ్యసంఘటన చోటుచేసుకుంది.
వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.
అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది.
ఇక ఈ వీడియో చూస్తే అచ్చం సినిమాల్లో యాక్సిడెంట్ సీన్ మాదిరి ఉందంటే నమ్మశక్యం కాదు.ఇంత భారీ ప్రమాదంలో ఓ శుభవార్త కూడా ఉంది.అదేంటంటే.కారులో ఉన్న వారికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం.అవును… వివరాల్లోకి వెళితే, చింద్వారా – నాగ్‌పూర్ హైవేపై లింగ సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా కొట్టింది.కారు అతివేగంగా రావడంతో పాటు భారీవర్షం కారణంగా రహదారిపై వర్షపు నీరు నిలిచి ఉండటంతో కారు అదుపు తప్పినట్లు తెలుస్తోంది.
దాంతో కారు పొలాల్లోకి పల్టీకొట్టుకుంటూ వెళ్ళిపోయింది.ఆ దగ్గరలో పశువులు కూడా వున్నాయి.అదృష్టవశాత్తు వాటికి కూడా ఏమి జరగలేదు.అవును….కారు పల్టీలు కొట్టుకుంటూ వస్తున్న విషయాన్ని గమనించిన ఆవు పక్కకు తప్పుకొని ప్రాణాలు కాపాడుకుంది.అదృష్టవశాత్తూ కారులో ఉన్న ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు.కాగా క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు.ఈ రోడ్డు ప్రమాదం వీడియోను ఎంపీ నకుల్ నాథ్ తన ట్వీట్ ఖాతాలో పోస్టు చేశారు.
వర్షాకాలంలో తక్కువ వేగంతో వాహనాన్ని నడపాలంటూ వాహనదారులను ఎంపీ ఈసందర్భంగా కోరారు.







