ఓటుకు వేల రూపాయలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ రాజకీయాలను కలుషితం చేశారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సీమాంధ్ర ఓటర్లలో అనుమానాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని నమ్మేవాళ్లను తీసుకుంటున్నామని బిజెపి నేతలు చెబుతున్నారు.తెలంగాణలో కెసిఆర్, ఏపీలో జగన్ ఓటుకు వెయ్యి, 2000, 3000, 5000 ఇచ్చి రాజకీయాలను కలుషితం చేస్తున్నారని బిజెపి నేతలు చెబుతున్నారు.
ఇలాంటి వారిని ఎదుర్కొనాలంటే కొద్దో గొప్ప పలుకుబడి ఉన్నవారు కావాలని అన్నారు.అక్రమ సంపాదన నల్లధనంతో రాజకీయాలను శాసిస్తూ ఉచితాలు ఇస్తామని చెబుతున్న పార్టీలను తట్టుకోవాలంటే ఇలాంటివారు అవసరమని అంటున్నారు.
జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో కలిసి అధ్యయనం చేశామని చెబుతున్నారు.సీమాంద్రులు ఎక్కువగా ఉన్న శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని డివిజన్లో మంచి ఫలితాలు రాలేదని చెబుతున్నారు.
సీమంద్రుల ఓటర్ల లో అసంతృప్తిని గ్రహించామని.దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని బిజెపి నేతలు అంటున్నారు.
రాజాసింగ్ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ సమర్థించదని బిజెపి నాయకులు చెబుతున్నారు.ఆయనపై వెంటనే చర్యలు తీసుకున్నామని అన్నారు.
మునావర్ ని రానీయ వద్దని కోరితే పని గట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని బిజెపి నేతలు అంటున్నారు.

ఏ వర్గం మనోభావాలు దెబ్బ తినకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెబుతున్నారు.బీసీల అండతో వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు.ఉత్తరాదిలో కుటుంబ పార్టీలను కాదని భారతీయ జనతా పార్టీ వైపు ముగ్గు చూపుతున్నారని నేతల వివరించారు.
ప్రాంతీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయని ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 40% మంత్రి పదవులు కేటాయించిందని తెలిపారు.
ఏపీ,తెలంగాణలో అధికారంలో ఉన్న వైసిపి, టిఆర్ఎస్ లు కుటుంబ పాలనకు ప్రాధాన్యమిస్తూ బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.ఏపీలో తమ పార్టీ విస్తరిస్తుందని సినీ, క్రీడా,సాహిత్యవేతలు, కవులు కళాకారులను ఆకర్షిస్తుందని బిజెపి నేతలు చెబుతున్నారు.