టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను.ఈయన తన సినిమాలతో రికార్డులు గల్లంతు చేయగలడు.లేదంటే అదే సినిమాతో భారీ డిజాస్టర్ కూడా అందుకోగలడు.బోయపాటి అంటేనే యాక్షన్ ఎంటర్టైనర్ అని ప్రేక్షకులు ఒక అవగాహనకు వచ్చేసారు.అంతలా ఈయన తన సినిమాల్లో యాక్షన్ ను రుచి చూపిస్తూ ఉంటాడు.ఇటీవలే బోయపాటి శ్రీను బాలయ్యతో అఖండ సినిమా చేసిన విషయం తెలిసిందే.
అఖండ సినిమాతో ఘన విజయం అందుకుని మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను రామ్ పోతినేని తో సినిమా ప్రకటించాడు.
రామ్ అయితే తన ఆశలన్నీ బోయపాటి మీదనే పెట్టుకున్నాడు.ఎందుకంటే ఇటీవలే రామ్ లింగుస్వామి దర్శకత్వంలో చేసిన ‘ది వారియర్‘ సినిమా విజయం సాధించలేదు.
దీంతో ఇప్పుడు బోయపాటి సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని ఆశ పడుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు కూడా ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు రాగ అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమా కోసం రామ్ షాకింగ్ డెషిషన్ తీసుకున్నారట.ఈ సినిమాలో రామ్ తన పాత్ర కోసం దాదాపు 11 కిలోల బరువు పెరగుతున్నట్టు టాక్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో యాక్షన్ కు తగినట్టుగా రామ్ లుక్ మార్చాలని బోయపాటి అనుకున్నారట.

అందుకే ఈ సినిమా కోసం రామ్ బరువు పెరగాలని నిర్ణయించు కున్నాడట.మరి ఇంత కష్టపడుతున్న రామ్ కు బోయపాటి అయినా భారీ విజయం ఇచ్చి పాన్ ఇండియా స్టార్ అని అనిపిస్తాడో లేదో చూడాలి.ఇక రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నారు.మరి ఈ సినిమాతో బోయపాటి రామ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తాడో చూడాలి.







