ఏపీలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి.తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది.దీని ప్రభావంతో రెండు రోజులపాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందన్నారు.ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.







