బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు, నటుడు ఆర్ జె అన్మోల్ ల జంట గురించి మనందరికీ తెలిసిందే.ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.కాగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట వారి పెళ్లి విషయాల గురించి వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న కష్టసుఖాలను గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
కాగా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన ఈ జంట ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ జంట వారి మధ్య జరిగే గొడవల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఆ జంట ఈ విధంగా చెప్పుకొచ్చారు.
పెళ్లి అయ్యి పదేళ్ల వరకు మా మధ్య ఎటువంటి గొడవలు, అభిప్రాయ బేధాలు లేవు.ఎప్పుడు అన్ని విషయాల్లోనూ మేమిద్దరం ఒకేలా ఆలోచించేవాళ్ళము.
ఒకసారి నేను, మరోసారి తను బెటర్‌గా ఆలోచిస్తాడనిపించేది అని చెప్పుకొచ్చారు అమృతారావు దంపతులు.

ఆ తరువాత మా జీవితాల్లోకి నా కొడుకు వీర్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పుడు రెండో బిడ్డను కనాలంటేనే నాకు భయమేసింది.ఎందుకంటే రెండవ బిడ్డ విషయం వచ్చినప్పుడు మా మధ్య చాలాసార్లు అభిప్రాయబేధాలు కూడా వచ్చాయి.రెండవ బిడ్డ విషయంలో అన్ని నిర్ణయాలు అన్మోల్ తీసుకోవాలనుకుంటాడు.
వాడి విషయంలో నేను చెప్పేవాటిని అంగీకరించేవాడు కాదు.నాకు తెలిసి అందరి ఇళ్లలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయనుకుంటాను.
అయినా మా 12 ఏళ్ల బంధంలో ఇవన్నీ ముఖ్యమే.నేను డేటింగ్ చేసిన వ్యక్తి నాతో ఉంటాడా? వదిలేస్తాడా? అనుకునేదాన్ని.కానీ అతడితోనే ప్రేమలో పడి ఆపై శారీరకంగానూ దగ్గరయ్యాను.చివరికి ఆ బాయ్‌ఫ్రెండే నాకు భర్తయ్యాడుఅని చెప్పుకొచ్చింది అమృత రావు.







