తెలుగు సినిమాలు బాక్సాఫీస్ ని షేర్ చేస్తూనే ఉన్నాయి.నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.రూ.55 కోట్ల వరకు వసూళ్లు చేసిన ఆ సినిమా ఈ మధ్య సందడి తగ్గి పోయింది.కానీ ఆ సినిమా తో పాటు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా మాత్రం ప్రేక్షకులను ఇంకా ఆకట్టుకుంటూనే ఉంది.50 రోజులకు చేరువ అయిన ఆ సినిమా రూ.75 కోట్ల వసూళ్ల ను నమోదు చేసింది.ఆ సినిమా తర్వాత వచ్చిన నిఖిల్ కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అయినా కూడా దుల్కర్ సల్మాన్ మరియు మృనాల్ ఠాకూర్ నటించిన సీతారామం సినిమా మాత్రం వసూళ్ల విషయం లో దూసుకు పోతూనే ఉంది.విడుదల అయ్యి ఇన్ని వారాలైనా కూడా ఈ స్థాయి వసూలు నమోదు చేసిన సినిమా లు ఈ మధ్య కాలం లో లేవు అని చెప్పాలి.
రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన సినిమా లు కూడా రెండు మూడు వారాల వరకు భారీ వసూళ్లు నమోదు చేసి ఆ తర్వాత కనుమరుగు అయ్యాయి.కానీ సీతారామం సినిమా మాత్రం వసూళ్ల విషయం లో కంటిన్యూ అవుతూనే ఉంది.
బింబిసారా కనిపించకుండా పోయినా కూడా సీతారామం మరియు కార్తికేయ 2 సినిమా ల జోరు ఒక రేంజ్ లో ఉంది.తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
దాంతో ఈ సినిమా లకు వసూళ్ల జాతర కంటిన్యూ అవ్వబోతుంది అంటూ ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ రెండు సినిమా లు మరో వారం రోజుల పాటు సందడి చేసి రూ.100 కోట్ల దిశగా దూసుకు పోయే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.







