విజయనగరం: విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించడమేంటి.
ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది.ఉద్యోగులు ప్రభుత్వ భాద్యత.
నిన్నటి రోజున చర్చలు జరపలేదు.విషయం ఎంటనేది తెలుసుకోవడానికి మాత్రమే వారితో సమావేశమయ్యాం.
సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పడం వాస్తవం.కొత్త స్కీమ్ ప్రొవైడ్ చేశాం, దాని మీద చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానం ఉద్యోగులకు ఆమోదయోగ్యమైనది కాదు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం.
దయచేసి ఉద్యోగులు సమస్యను అర్ధం చేసుకోగలరు.రాష్ట్రంలో వారికూడా బాగస్వాములు.
మిలియన్ మార్చ్ సంగతి నాకు తెలియదు.ఉద్యోగ సంఘాలు వారి సమస్యల పై పోరాటం చేసే హక్కు వారికుంది.
గత ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యి ఉంటే అలాంటి ఉద్యోగులకు నోటీసులు ఇస్తున్నారు.సిఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే ఊరుకుంటామా.
ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అన్ని శాఖల్లో అమలుచేస్తాం.







