కృష్ణా జిల్లా వీరవల్లి పోలీస్ స్టేషన్ వద్ద మల్లవల్లి రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ప్రభుత్వం తమ భూములను తీసుకొని ఆరేళ్లు అవుతున్నా పరిహారం చెల్లించడం లేదని వాపోయారు.
పైగా తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు.సుమారు 30 మంది రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.
పీఎస్ ఎదుట బైఠాయించారు.ఈ క్రమంలో పది మంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.







