హైదరాబాద్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
దీనిలో ప్రధానంగా దేశంలో నెలకొన్న వ్యవసాయ రంగం పరిస్థితులతో పాటు.తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై చర్చ జరిగింది.
అమెరికా, చైనా కంటే మన దేశంలోనే వనరులు ఎక్కువగా ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్.ప్రకృతి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి దేవుడిచ్చిన వరమన్న ఆయన.
దేశంలో 40 వేల కోట్ల సాగు భూమి ఉందని తెలిపారు.అదేవిధంగా 70 వేల టీఎంసీల నీటి వనరులు ఉన్నా.
సాగు, తాగునీటికి ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ , సాగునీరు ఇస్తున్నప్పుడు దేశ వ్యాప్తంగా కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు.







