థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న 'రహస్య' టీజర్

కొత్త కాన్సెప్ట్ కథలు, మిస్టరీ థ్రిల్లింగ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతున్నారు నేటితరం ఆడియన్స్.రొటీన్ చిత్రాలకు భిన్నంగా సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు.

 Hero Nivas Sistu Rahasya Movie Teaser Released Details, Hero Nivas Sistu ,rahasy-TeluguStop.com

ఇప్పుడు ఇదే బాటలో వైవిద్యభరితమైన కథతో రూపుదిద్దుకుంటున్న మూవీ “రహస్య”. SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నివాస్ శిష్టు, సారా ఆచార్ హీరోహీరోయిన్లుగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి.ఎస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన “రహస్య” ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

అదేవిధంగా ఈ మూవీ గ్లిమ్స్ ను విడుదల చేసి ప్రేక్షలోకాన్ని ఆకర్షించిన యూనిట్ తాజాగా టీజర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచేశారు.కేవలం 52 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం సినిమా పట్ల ఆసక్తి రేకెత్తిస్తోంది.

క్రైం మిస్టరీ నేపథ్యంలో మిస్టరీ కథాంశంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది.అంతుచిక్కని ఓ క్రైం ఇన్సిడెంట్‌ని పోలీసు వర్గాలు ఎలా ఛేదించాయి? ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఎలాంటివి? అనే పాయింట్ తో రియలిస్టిక్‌గా ఈ రహస్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతోంది.థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీకి తెర రూపమిచ్చారని తెలుస్తోంది.

ఈ సినిమాతో నివాస్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారిగా నటిస్తున్నాడు.ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతం అందించగా.

బుగతా సత్యనారాయణ, గెద్ద వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, సూరి బాబు, పాండు రంగారావు, ప్రదీప్, మోడల్ శ్రీను, రాజేశ్వరి, మధు, నల్ల శ్రీను, B.T.రావ్, T.V.రామన్, A.V.ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

సాంకేతిక నిపుణులు:

బ్యానర్ :యస్.యస్.యస్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాత : గౌతమి.ఎస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజేష్.CH, దర్శకత్వం : శివ శ్రీ మీగడ, సంగీతం : చరణ్ అర్జున్, బ్యాగ్రౌండ్ స్కోర్ : సునీల్ కశ్యప్, కెమెరామెన్‌ : జీ సెల్వ కుమార్, కోడైరెక్టర్ : రవి, ఎడిటర్‌ : ఎస్ బి ఉద్దవ్, పి ఆర్.ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube