మాస్ మహరాజ్ రవితేజ రీసెంట్ గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మరో ఫెయిల్యూర్ ఖాతాలో వేసుకున్నాడు.అయితే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నా సరే వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు రవితేజ.
ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు, ధమాకా సినిమాలు చేస్తున్న రవితేజ ఆ తర్వాత కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని డైరక్టర్ గా మారి చేస్తున్న సినిమా ఫిక్స్ చేశాడని టాక్.కార్తిక్ ఘట్టమనేని డైరక్షన్ లో రవితేజ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.
ఈ సినిమాకి ఈగల్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్.త్వరలోనే సినిమా ఎనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు.ఇదేకాకుండా శ్రీవాస్ డైరక్షన్ లో కూడా రవితేజ సినిమా రాబోతుందని తెలుస్తుంది.ఈ మూడు సినిమాలు పూర్తి చేశాక శ్రీవాస్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సుధీర్ వర్మ రావణాసుర సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది.రావణాసురుడు మీద రవితేజ చాలా హోప్స్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.
ధమాకా కూడా రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ధమాకా నుంచి రిలీజైన జింతాక్ సాంగ్ కూడా ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది.