మన టాలీవుడ్ హీరోల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెబుతారు.ఈయన క్రేజ్ ముందు బడా హీరోలు సైతం పనికి రారు.
అలాంటిది న్యాచురల్ స్టార్ నాని పవర్ స్టార్ కు ఎదురు నిలవ బోతున్నాడు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నాని ఎదురు రావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.
అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ‘హరి హర వీరమల్లు‘ సినిమా ఒకటి.
ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెజెంట్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అఫిషియల్ గా ప్రకటించారు.2023 మార్చి 30న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు.ఈయన ప్రకటించిన రెండు రోజుల తర్వాత నిన్న నాని నటిస్తున్న దసరా సినిమా రిలీజ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు.

నాని శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో చేస్తున్న దసరా సినిమాను కూడా 2023 మార్చి 30న రిలీజ్ కాబోతున్నట్టు చెప్పారు.దీంతో ఇప్పుడు పవర్ స్టార్ కు న్యాచురల్ స్టార్ కు మధ్య బాక్సాఫీస్ క్లాష్ వచ్చింది.అసలు పవర్ స్టార్ క్రేజ్ ముందు నాని క్రేజ్ సరిపోతుందా? అనేది అందరి ప్రశ్న.వీరిద్దరూ నిజంగానే ఒకేరోజు వస్తే పవన్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ నానికి మాత్రం సినిమా హిట్ అయినా కలెక్షన్స్ రావడం కష్టం అవుతుంది.

మరి రిలీజ్ వచ్చే ఏడాది కాబట్టి ఈ లోపు పవర్ స్టార్ సినిమా డేట్ మార్చుకుంటుందా లేదంటే నాని తగ్గుతాడా అనేది వేచి చూడాలి.ఇక నాని గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.దసరా సినిమాలో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.
నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.







