ఏపీలో చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.నాటకం నిషేధించాలని ఎవరూ కోరలేదని, కించపరిచే పదాలను తొలగించాలని మాత్రమే కోరారని పిటిషనర్ తెలిపారు.
అంతేకాకుండా ఒక సామాజిక వర్గం కోసం ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వాదనలు విన్న ధర్మాసనం.
రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు అందించాలని తెలిపింది.అనంతరం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.







